(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)


లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 15 


రచన: మల్లవరపు సీతారాం కుమార్


గత ఎపిసోడ్ లో…


దినకరన్ కి ఫోన్ చేసి కొడుకు చెప్పమన్నట్లు చెబుతాడు గురుమూర్తి. ఆయన చక్రధరం గారితో మాట్లాడి అంగీకరిస్తాడు. కాలేజీలో మ్యాచ్ ప్రాక్టీస్ కోసం గ్రౌండ్ కి వెళతారు రిత్విక్, జీవన్, ఇంకా మిగతా టీం. అనూహ్యంగా అక్కడికి ఆద్య తో పాటు రాఘవేంద్ర గారు కూడా వస్తారు.


ఇక చదవండి…


రాఘవేంద్ర గారు కోరడంతో క్రికెట్ టీమ్ మెంబర్స్ అందరూ ఆయన చుట్టూ చేరారు. ఆయన ఒకసారి చుట్టూ పరిశీలించి చూశాడు.


“మ్యాచ్ ప్రాక్టీస్ చూడడానికి కూడా ఇంతమంది రావడం ఒక ఎత్తయితే ముందుగానే దీన్ని ఊహించి కుర్చీలు, షామియానాలు, వాటర్ బాటిల్స్ ఏర్పాటు చేసిన రిత్విక్ ముందుచూపు ను మనమంతా అభినందించాలి” అని ఆయన అనగానే అక్కడ ఉన్న వాళ్లంతా చప్పట్లు కొట్టారు.


ఆయన తన మాటలు కొనసాగిస్తూ “ఈ ఇంటర్ కాలేజ్ క్రికెట్ టోర్నమెంట్ గత పది సంవత్సరాల నుండి నేనే స్పాన్సర్ చేస్తున్నాను. మొదటిసారిగా మన కాలేజ్ టీం, రిత్విక్ సారథ్యంలో సెమీ ఫైనల్ కి చేరుకోవడం నాకు చాలా ఆనందం గా ఉంది. మనకు వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మిగిలిన రెండు మ్యాచ్ లలో విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క ప్లేయర్ తన పూర్తి సామర్థ్యం ఉపయోగించి ఆడితే కప్ గెలుచుకోవడం అసాధ్యమేమీ కాదు. ముఖ్యంగా మీలో ఎవ్వరికీ ప్రతిభ తక్కువగా లేదు. మిమ్మల్ని ప్రోత్సహించడం కోసమే నేను స్వయంగా వచ్చాను” అంటూ అందరు ప్లేయర్స్ కీ షేక్ హ్యాండ్ ఇచ్చాడు.


ప్రాక్టీస్ మ్యాచ్ కి సహకరించడానికి వచ్చిన శోభన్ కాలేజ్ స్టూడెంట్స్ ని కూడా అభినందించారు ఆయన.


Read the full story on www.manatelugukathalu.com


ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.


దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ


ఈ కథను యూట్యూబ్ లో చూడండి


Video link


https://youtu.be/0fdOo0hvexw